News29th Sep 03:35 PMSunil Byrisetty1 min read
అరకిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం
అంతర్వేది తీరంలో సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలోని బీచ్లో సముద్రం సాధారణం కంట
అంతర్వేది తీరంలో సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలోని బీచ్లో సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. సునామీ వచ్చే ముందు ఇలా జరుగుతుందంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఆ తీర ప్రాంతమంతా ఒండ్రు మట్టితో కూడిన బురదతో నిండిపోయింది. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు. అయితే, సోమవారం మధ్యాహ్నానికి అంతర్వేది బీచ్ వద్ద సముద్రం మళ్లీ ముందుకు వచ్చింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్ర కెరటాలు స్థానిక లైట్ హౌస్ను తాకుతున్నాయి.