News21st Aug 11:28 AMSunil Byrisetty1 min read
మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతర గాలింపు
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్‌తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 5 నౌకలు, రెండు డోర్నియర్ విమానాలు, ఒక హెలికాప్టర్‌తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు తెలియజేశారన్నారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్‌తోపాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీరప్రాంతాల్లోని కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా చేరవేశారని తెలిపారు. ప్రస్తుతం బోటు ఆచూకీ లభించనప్పటికీ, సెర్చ్ ఆపరేషన్‌లో విరామం ఉండదని స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కోస్ట్‌గార్డ్, నేవీతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.