News20th Dec 12:02 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛ ఆంధ్రతో ఎన్నో వ్యాధులు తగ్గాయి

కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. స్వచ్ఛ

స్వచ్ఛ ఆంధ్రతో ఎన్నో వ్యాధులు  తగ్గాయి
కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు గతం కన్నా తగ్గాయని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం మోర్ఛపూడి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పార్థసారధి పాల్గొన్నారు. వ్యాధులకు మూలం అపరిశుభ్ర వాతావరణమన్నారు. ప్రజలంతా శుభ్రం పాటించకపోవడం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు. రూ.30 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజారోగ్య పరిరక్షణకు ఖర్చు చేస్తుందన్నారు. వ్యాధుల మూలంగా ప్రజలు ఆర్థికంగా నష్టపొవడమే కాక, శారీరకంగా కూడా బలహీనులవుతారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధులు వచ్చిన తరవాత చికిత్స కన్నా వ్యాధులు రాకుండా నివారణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రతీ నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు.స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులు గతంలో కన్నా తక్కువగా నమోదయ్యాయని, ఇది ఒక మంచి శుభ పరిణామన్నారు.
Andhra Pradesh Government
Swachha Andhra Programme
Public Health
Disease Prevention
Kolusu Parthasarathi
పరిశుభ్రత ఉద్యమం
స్వర్ణ ఆంధ్ర
సీజనల్ వ్యాధులు
Scroll for the next article