Education17th Sep 01:01 PMSunil Byrisetty1 min read
హార్టికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ సీట్ల కేటాయింపు
వెంకట్రామన్నగూడెంలోని డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ(ఆనర్స్)లో చేరేందుకు ఈనెల 23వ తేదీ నుంచి ఆన్లైన్ విధ
వెంకట్రామన్నగూడెంలోని డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ(ఆనర్స్)లో చేరేందుకు ఈనెల 23వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో సీట్లు కేటాయిస్తామని రిజిస్ట్రారు బి. శ్రీనివాసులు తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు 24, 25 తేదీల్లో వారికి కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరా లన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఈనెల 16, 17, 18 తేదీల్లో దరఖాస్తు చేసుకున్నవారికి వెబ్ ఆప్షన్ అవకాశం కల్పించామన్నారు. ఉద్యాన కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అటవీ శాస్త్రం కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇతర వివరాలను వర్సిటీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు.