Politics24th Oct 05:27 PMSunil Byrisetty1 min read

చంద్ర‌బాబు చేతిలో కీలుబొమ్మ‌లా ఎస్ఈసీ

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండి

చంద్ర‌బాబు చేతిలో కీలుబొమ్మ‌లా ఎస్ఈసీ
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నామినేషన్లు వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా సక్రమంగా నామినేషన్లు వేయని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నామినేషన్ కేంద్రాల్లోకి మీడియాను అనుమతించకుండా, పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేస్తూ ఏకపక్షంగా 'ఏకగ్రీవాలు' చేసుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఐపీఎస్ అధికారులతో పాటు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు సహా మొత్తం 54 మంది పోలీసు అధికారులను తాము గుర్తించామని, వీరిపై న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ‌ పోరాటం చేస్తామని రాంబాబు స్పష్టం చేశారు.
Scroll for the next article