News9th Jul 09:49 AMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై రెండో రోజు శాకంబరీ దేవి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శాకంబరీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు కూరగాయలతో విశేష అలంకారం చేశారు.. ఇక, అమ్మవారికి భక్తులు విరాళంగా కూరగాయలను సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దుచేశారు.