News13th Jul 04:42 PMSunil Byrisetty1 min read

జాబ్ కేలండర్ పై శాఖాధిపతులతో సిఎస్ సమావేశం

రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి సన్నద్ధతపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమయ్యారు. ప

జాబ్ కేలండర్ పై శాఖాధిపతులతో సిఎస్ సమావేశం
రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి సన్నద్ధతపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమయ్యారు. ప్రధానంగా రెండవ దశ జాబ్ కేలండర్ కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎంలపై చర్చిస్తున్నారు. అలాగే లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ కేడర్లరో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్ పై కసరత్తు ప్రారంభించారు. అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రిపరేషన్, ఎలాంట్మెంట్ ఆఫ్ పెర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఎపిపిఎస్సి ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీలపై ఒక స్పష్టత రానుంది. ఖాళీల సంఖ్య నిర్ధారించిన తర్వాత భర్తీపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది.
AP Job Calendar
Andhra Pradesh
AP Government
Direct Recruitment
APPSC
Government Jobs
CS Sai Prasad
Job Notifications
Recruitment 2026
eHRMS
Local Cadre
Vacancies
Scroll for the next article