News3rd Jan 12:25 PMSunil Byrisetty1 min read
నేటి నుంచి భూసమీకరణ కార్యకలాపాలు
రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రక్రియకు సంబంధించి శనివారం కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. తొమ్మిది యూనిట్లు ఏర్పాటు చేయనుండగా, అందులో ఏడు కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ
రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రక్రియకు సంబంధించి శనివారం కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. తొమ్మిది యూనిట్లు ఏర్పాటు చేయనుండగా, అందులో ఏడు కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యా యి. తీసుకున్న భూమి వివరాలు ఎలా నమోదు చేయాలి, ఫార్మాట్లు తదితర అంశాలపై శిక్షణ మొదలుపెట్టారు. పూలింగుకు సంబంధించి గ్రామాల వారీ భూమి వివరాలు, రైతులు, వృత్తులు, వ్యవసాయంపై ఆధారపడుతున్న వారు, ఏ పంట దిగుబడి ఎంత ఉంది వంటి అంశాలపై తుళ్లూరు, అమరావతి తహశీల్దార్లు నివేదిక పూర్తి చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు, సిఆర్డిఎ కార్యాలయానికి పంపారు. అదనంగా ఇద్దరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కావాల్సి ఉండటంతో వారి నియామకాన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిసింది. 20,494 ఎకరాలకు సంబంధించిన రైతుల సంఖ్యలోనూ తేడాలు ఉండటంతో వాటిని సరిచేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూమికి సంబంధించి అటవీ భూమి, కొండ పోరంబోకు వంటి భూములు కూడా ఉన్నాయని, వాటిల్లో కొంత సాగుదారులు, కొన్నిచోట్ల పట్టాలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని ఏ కేటగిరి కింద చేర్చాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.