Education9th Jul 09:42 AMSunil Byrisetty1 min read
10 లక్షల మందికి రెండో విడత తల్లికి వందనం
తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందని విద్యార్థులు, కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి నిధులను రెండో విడతలో ప్రభుత్వం విడుదల చేయనుంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో ల
తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందని విద్యార్థులు, కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి నిధులను రెండో విడతలో ప్రభుత్వం విడుదల చేయనుంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో లబ్ధి పొందనున్నారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్నా ఒకే కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నవారు, ఆధార్ నంబర్లు సరిగా నమోదుచేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగ్‌లో ఉంచారు. వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు. విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46 వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు.