Telangana24th Aug 10:31 AMSunil Byrisetty1 min read
సీఎంకు వ్యతిరేకంగా మీటింగ్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం జరిగినట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నిర్వహించ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం జరిగినట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నిర్వహించారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రెండు రోజుల కింద జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డికి చేరినట్లు సమాచారం. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మీటింగ్ నిర్వహించారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.