News2nd May 12:57 PMSunil Byrisetty1 min read

సీఆర్పీఎఫ్ ఆపరేషన్.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్!

మావోయిస్టు ప్రాంతాలపై సీఆర్పీఎఫ్ పైచేయి సాధించింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేష

సీఆర్పీఎఫ్ ఆపరేషన్.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్!
మావోయిస్టు ప్రాంతాలపై సీఆర్పీఎఫ్ పైచేయి సాధించింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేషన్లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఘనవిజయం సాధించింది. మావోయిస్టుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అడవుల్లో కష్టమైన ప్రదేశాలను గుర్తించి సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ ఆపరేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ స్వయంగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. ఇప్పటికే మావోయిస్టుల డంపులు, సొరంగాలను గుర్తించిన భద్రతా బలగాలు, వాటిని నిర్వీర్యం చేయడంలో విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Karreguttas
Security Forces
CRPF
Mavoist
డ్రోన్లు
కర్రెగు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్
కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్
మావోయిస్టుల చొరబాట్ల
ఇంటెలిజెన్స్ బ్యూరో
Scroll for the next article