Spiritual6th Jan 03:33 PMSunil Byrisetty1 min read
భక్తులను జై దుర్గా అని పలకరించాలి
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వర్టించే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి గతంలో కంటే మెరుగ్గా పనిచేయాలని ఈవో శీనా నాయక్ అన్నారు. భక్తులతో ఎలా గౌర
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో విధులు నిర్వర్టించే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి గతంలో కంటే మెరుగ్గా పనిచేయాలని ఈవో శీనా నాయక్ అన్నారు. భక్తులతో ఎలా గౌరవంగా వ్యవహరించాలి అనే అంశంపై మహామంటపం 6వ అంతస్తులో జరిగిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు రక్షణగా ఉంటూనే, వారితో మర్యాదగా ప్రవర్తించడం భద్రతా సిబ్బంది బాధ్యత అని ఈవో పేర్కొన్నారు. భక్తులను వినయపూర్వకమైన పలకరింపుతో భక్తులు కనిపించగానే చిరునవ్వుతో, "నమస్కారం" లేదా "జై దుర్గా" అని పలకరించడం ద్వారా సానుకూల వాతావరణాన్ని కల్పించాలని, వారితో మాట్లాడేటప్పుడు గౌరవంగా "అండి" అని, భవాని అని సంబోధించాలని ఈవో వివరించారు. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలతో ఉన్న భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులను తోయడం లేదా గట్టిగా అరుస్తూ భయపెట్టడం చేయకుండా
"దయచేసి ముందుకు జరగండి" లేదా "కొంచెం సహకరించండి" అని సున్నితంగా కోరుతూ, సహనం, నిగ్రహంతో ఉండాలని శీనా నాయక్ పేర్కొన్నారు.