News15th Jun 10:47 AMSunil Byrisetty1 min read
సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ
అమరావతి నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించాలనుకున్న సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటివరకు దొండపాడు నుంచి వెంకటపాలెం రెవెన్యూ పరిధి మంతెన ఆశ్రమం వరకు రోడ్డు
అమరావతి నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించాలనుకున్న సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు మార్గం సుగమం అయ్యింది.
ఇప్పటివరకు దొండపాడు నుంచి వెంకటపాలెం రెవెన్యూ పరిధి మంతెన ఆశ్రమం వరకు రోడ్డు వున్నది. అక్కడ నుంచి ఆగిపోయింది. పెనుమాక రైతులు కూడా పూలింగ్ భూములు ఇవ్వడంతో ఇటీవల వాళ్లకు ప్లాట్స్ కూడా కేటాయించారు.
దీనితో 49వ అధారిటీ సమావేశములో రోడ్డు విస్తరణకు 620 కోట్లు కేటాయించారు.
సీతానగరం వర్కుషాప్ నుంచి నేరుగా మణిపాల్ అస్పత్రి వరకు ఫ్లై ఓవర్ నిర్మించానున్నారు.
జాతీయ రహదారి వద్ద ట్రంపేట్ జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు.