News20th Jan 11:10 AMSunil Byrisetty1 min read

వక్ఫ్ బోర్డ్ భూములు స్వాధీనం అన్యాయం

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని వనరులు భూ దోపిడి చేస్తున్న ఏకైక నాయకుడు మంత్రి నారా లోకేష్ అని బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు. అభివృద్ధి పేర

వక్ఫ్ బోర్డ్ భూములు స్వాధీనం అన్యాయం
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని వనరులు భూ దోపిడి చేస్తున్న ఏకైక నాయకుడు మంత్రి నారా లోకేష్ అని బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ఉన్న విలువైన భూములను కార్పొరేటు వ్యవస్థకు కట్టబెట్టటమే పనిగా ఈ ప్రభుత్వం పనిచేయడం బాధాకరమన్నారు. సోమవారం మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని గ్రామంలోని వక్ఫ్ బోర్డ్ వ్యవసాయ భూములైన 70 ఎకరాలను బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, ముస్లిం సమైక్యవేదిక వైస్ ప్రెసిడెంట్ మౌలా బేగ్ లతో కలిసి పరివేక్షించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వనరులు, భూములను ఎలా దోపిడీ చేయాలన్న విషయంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న విలువైన దేవాలయ ట్రస్ట్ భూములు,ప్రభుత్వ భూములు, అటవీశాఖ, వక్ బోర్డ్ , రైతుల భూములను పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అన్యాయంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Waqf Board Lands
BCY Party
Bode Ramachandra Yadav
Nara Lokesh
Land Acquisition
మైనారిటీ హక్కులు
ముస్లిం సంఘాలు
ప్రభుత్వ విధానాలు
Scroll for the next article