Politics25th Apr 09:53 AMSunil Byrisetty1 min read
జగన్ ఒప్పందం.. మనకొద్దు!
సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో సెకీ -ఆదాని ఒప్పందంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 2021 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ -ఆదాని లతో చేసుకున్న 25 సంవత్సర
సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో సెకీ -ఆదాని ఒప్పందంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
2021 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ -ఆదాని లతో చేసుకున్న 25 సంవత్సరాల సౌర ఒప్పందం మూలంగా 1,25,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలుగుతుందని ఈ ఒప్పందాన్ని నేటి కూటమి ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్రకటించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గత ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచంగా ఇచ్చి సౌర ఒప్పందం చేసుకున్నారని అమెరికా ప్రభుత్వ న్యూయార్క్ ఈస్టిన్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు అయిందని ఈ పరిస్థితులలో నేటి ప్రభుత్వం ఆదానీపై కేసు నమోదు చేయాలని జ్యుడీషియల్ విచారణ హైకోర్టు న్యాయమూర్తితో చేపట్టాలని, సోలార్ ఉత్పత్తిని వికేంద్రీకరణ చేయాలని, స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని ఆపాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
విద్యుత్ వినియోగదారులను చైతన్యపరిచి ఉద్యమింప చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని భావించారు.
ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా||పి.వి. రమేష్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి, సిపిఎం నేత సిహెచ్ బాబురావు, కాంగ్రెస్ పార్టీ నేత కొలనుకొండ శివాజీ, సిపిఐ నేత రవీంద్రనాథ్, పౌర సంస్థల నేతలు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, టి లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీ ప్రసాద్, డాని,చిగురుపాటి భాస్కరరావు, డి రమాదేవి, హరినాథ్, బీఎస్పీ నేత పుష్ప రాజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు