News15th Aug 05:07 PMSunil Byrisetty1 min read

సెమీ కండక్టర్‌ రంగం.. అభివృద్ధికి కీలకం

భారత్‌ 3 సెమీకండక్టర్ ప్లాంట్లు నెలకొల్పి ఈ రంగంలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యవసరమైన ఇంధన భద్రతపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నిన

సెమీ కండక్టర్‌ రంగం.. అభివృద్ధికి కీలకం
భారత్‌ 3 సెమీకండక్టర్ ప్లాంట్లు నెలకొల్పి ఈ రంగంలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అత్యవసరమైన ఇంధన భద్రతపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదంతో ముందుకెళ్తున్నాం.. దేశంలో మెట్రో రైళ్ల సదుపాయం పెంచాం.. ఐదు న్యూక్లియర్‌ ప్లాంట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.. దేశం కొత్త సంకల్పంతో ముందుకెళ్తోందని వివరించారు. ఢిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ మాట్లాడుతూ కరోనా ప్రపంచాన్నే ముంచేసింది.. కరోనా నుంచి బయటపడగానే యుద్ధాలు ముంచెత్తాయి.. ముందు ఉక్రెయిన్‌ యుద్ధం.. ఇప్పుడు ఇరాన్‌ యుద్ధం అని తెలిపారు. యుద్ధాలు వస్తే పెట్రోల్‌, డీజిల్‌, ఫర్టిలైజర్స్‌ దొరకదని భయపెట్టారు.. కానీ, అడ్డంకులన్నీ అధిగమించాం.. యూరియా విషయంలో రైతులపై భారం పడకుండా చూస్తున్నామని వివరించారు. ప్రపంచంలో ఇప్పుడు గ్లోబలైజేషన్‌ మాట వినపడటం లేదు.. ప్రపంచం మన సామర్ధ్యాన్ని గుర్తించడం మొదలైందని పేర్కొన్నారు.
India
Semiconductor Industry
Narendra Modi
Semiconductor Plants
Make in India
Vocal for Local
India Development
ఇంధన భద్రత
అణు విద్యుత్
మెట్రో రైలు
ఎర్రకోట
స్వాతంత్ర్య దినోత్సవం
భారత ఆర్థిక వ్యవస్థ
సాంకేతికత
Scroll for the next article