News7th Jan 02:58 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై రాజేంద్ర ప్రసాద్ పూజలు
నేడు ఉదయం విజయవాడ చేరుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక
నేడు ఉదయం విజయవాడ చేరుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంద్రకీలాద్రికి చేరుకోగా, ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఆలయ మర్యాదలతో రాజేంద్ర ప్రసాద్‌కు శేష వస్త్రాన్ని కప్పి గౌరవించారు. ఆలయ అధికారులు అమ్మవారి, ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.