Politics11th Apr 02:55 PMSunil Byrisetty1 min read
ఏపీ బీజేపీ సీనియర్ నేతకు ‘X’ కేటగిరీ భద్రత
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యస్. విష్ణు వర్ధన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ‘X’ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యస్. విష్ణు వర్ధన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ‘X’ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం, కేంద్ర హోంశాఖ, కేంద్ర నిఘా సంస్థల సంప్రదింపుల అనంతరం, జాతీయ స్థాయి VIP రక్షణ విభాగం ఈ భద్రతా కేటగిరీని కేటాయించింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (VIP సెక్యూరిటీ విభాగం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.
ఇకపై ఆయన భద్రతపై సమగ్ర పర్యవేక్షణను కేంద్ర హోంశాఖ చేపడుతుంది.
ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆయన పర్యటించే సమయంలో ఈ భద్రత అమలులో ఉంటుంది.
పార్టీలో సీనియర్ నేతగా, కేంద్రంలో కీలకమైన నామినేటెడ్ పదవుల్లో సేవలందించిన విష్ణు వర్ధన్ రెడ్డి ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ తరపున కీలకంగా పనిచేశారు. గతంలో ఈయన భద్రత రాష్ట్ర నిఘా సంస్థల పరిధిలో ఉండేది, నూతన ఆదేశాల మేరకు కేంద్ర పరిధిలోకి మారింది