Health3rd Apr 09:27 AMSunil Byrisetty1 min read

సీనియర్ సిటిజన్సా.. మీ కోసమే ఈ బీమా

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 'పీఎంజేఏవై వయో వందన' (ఆరోగ్య బీమా) కింద సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు, ఆపైన ఉన్న వారందరికీ ఆ

సీనియర్ సిటిజన్సా.. మీ కోసమే ఈ బీమా
కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 'పీఎంజేఏవై వయో వందన' (ఆరోగ్య బీమా) కింద సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్లు, ఆపైన ఉన్న వారందరికీ ఆరోగ్య బీమాను వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చింది. 70 ఏళ్లు దాటిన వారికీ రూ.5 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా రూ.25 లక్షల వార్షిక పరిమితితో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఆరోగ్య బీమా అందుతోంది. 'పీఎంజేఏవై వయో వందన' అమలైతే దారిద్య్రరేఖకు ఎగువనున్న వారూ రూ.5 లక్షల మేర ఉచిత బీమా పొందే అవకాశం ఏర్పడుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 70 ఏళ్ల వయస్సున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నవారు అందులోనే కొనసాగుతారా? పీఎంజేఏవై పరిధిలోనికి వస్తారా? అన్న అంశంపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లాల వారీగా కొత్త కార్డులు ఇస్తారు
Health Insurance
Senior Citizen
ఆరోగ్య బీమా
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు
పీఎంజేఏవై వయో వందన
Scroll for the next article