News19th May 04:02 PMSunil Byrisetty1 min read
విజయనగరం ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను నిందితులు అమలు చేస్తున్నట్లు గుర్తించారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను నిందితులు అమలు చేస్తున్నట్లు గుర్తించారు.
రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్ చేసినట్లు విచారణలో తేల్చారు.
6 నెలల్లో సిరాజ్ మూడుసార్లు సౌదీ వెళ్లినట్టు పోలీసులకు వివరాలు అందాయి.
ఆరుగురితో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో గ్రూప్ క్రియేట్ చేసి, సిరాజ్, సమీర్‌తో పాటు టీమ్‌లో కర్ణాటక, మహారాష్ట్ర యువకులను నియమించుకున్నట్లు తేల్చారు.
హైదరాబాద్‌లో మూడు రోజులు కలిసి ఉన్న ఆరుగురు.. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై మీటింగ్ నిర్వహించినట్లు గుర్తించారు.
టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశం అందడంతోపాటు, మిగిలిన నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.