News9th Sep 10:36 AMSunil Byrisetty1 min read
రెండేళ్ల క్రితం ఇదే రోజు.. జైలుకు!
సెప్టెంబర్ 9, 2023. టీడీపీకి, తెలుగు రాష్ట్రాలకు గుర్తుండిపోయే రోజు. ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసిన రోజు.. కానీ వారికి ఆ రోజుకి
సెప్టెంబర్ 9, 2023. టీడీపీకి, తెలుగు రాష్ట్రాలకు గుర్తుండిపోయే రోజు. ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసిన రోజు.. కానీ వారికి ఆ రోజుకి తెలియదు, నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందని..! చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా రెండేళ్ల క్రితం ఇదే రోజు పౌర సమాజం భగ్గుమంది. మహిళా లోకం కదం తొక్కింది. యువత తిరగబడింది. చంద్రబాబుకి మద్దతుగా హైదరాబాద్ తో పాటు 70 దేశాలలోని తెలుగు ప్రజలు ఉద్యమించారు. జగన్‌పై జనం శాంతియుతంగా పోరాడారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు. చంద్రబాబుని ప్రజా హృదయ విజేతగా నిలిపారు. ముఖ్యమంత్రిగా గెలిపించారు.