Entertainment1st Sep 11:51 AMSunil Byrisetty1 min read

బాక్సీఫీస్ వద్ద సెప్టెంబర్ సందడి!

సెప్టెంబర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. తొలి వారంలో అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ నుంచి ‘

బాక్సీఫీస్ వద్ద సెప్టెంబర్ సందడి!
సెప్టెంబర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. తొలి వారంలో అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ నుంచి ‘రోమాంచకం’ వస్తోంది. సుమంత్ ప్రభాస్, అవంతిక జంటగా నటించిన ఈ సినిమాపై యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. వీటితో పాటు ‘సహా’, ‘ఏమి అనుకోలేదు’ వంటి చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’, మలయాళంలో హిట్ అయిన ‘బెత్లెహేమ్ కుడుంబ యూనిట్’, ‘మీర్జాపూర్: ది మూవీ’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా తొలి వారంలోనే థియేటర్లలోకి రానున్నాయి. రెండో వారంలో ‘మారెమ్మ’తో రవితేజ అన్న కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎపిక్’ కూడా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే వారంలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’తో వస్తున్నారు. కార్తీ ‘సర్దార్ 2’తో వస్తున్నారు. సుహాస్ నటించిన ‘మండాడి’ అనే తమిళ డబ్బింగ్ సినిమా కూడా రానుంది. సెప్టెంబర్ 18న ‘అనుమానపక్షి’, ‘సీక్రెట్ సోల్జర్’, ‘కాగితం పడవలు’ సినిమాలు వస్తున్నాయి. ఇక నాని సినిమా ‘ది ప్యారడైజ్’ కోసం 24ను లాక్ చేసుకున్నారు.
Telugu Cinema
Tollywood
September Movies
Movie Releases
Box Office
September Movie Releases
Allari Naresh
Rambha Urvashi Menaka
Romanchakam
Vaishnavi
Sumanth
Mahendragiri Varahi
Karthi
Sardar 2
Suhas
Nani
The Paradise
Scroll for the next article