Crime23rd Aug 04:15 PMSunil Byrisetty1 min read
పాత గుంటూరు. భయంతో బెంబేలు!
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఘటనలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం రాత్రి బస్ స్టాండ్ ఆవరణలో సాక్షాత్తు పోలీసులపై కొందరు వ్యక్తులు దాడులకు దిగారు. వెనువెంటనే
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస ఘటనలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం రాత్రి బస్ స్టాండ్ ఆవరణలో సాక్షాత్తు పోలీసులపై కొందరు వ్యక్తులు దాడులకు దిగారు. వెనువెంటనే సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడ్డ మరొక ఘటన చోటు చేసుకుంది. వరుస ఘటనలతో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తన చావుకు పాత గుంటూరు స్టేషన్ ఎస్ హెచ్ ఓ, మరో ఇరువురు కారణ మంటూ బాధితుడు ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. తనను తన తల్లిని ఇబ్బందులు పెడుతున్నారని సెల్ఫీ వీడియో పెట్టి తన చావుకు బాద్యులు స్టేషన్ ఎస్ హెచ్ ఓ, మరో ఇరువురు అంటూ యువకుడు పేర్లను చెప్పాడు. సాక్షాత్తు పోలీసులపైనే దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలపై చర్యలు తీసుకొని బాధితులకు తగు న్యాయం చేయాలని పౌరసంఘాలు, ప్రజలు కోరుతున్నారు.