Politics24th Dec 03:29 PMSunil Byrisetty1 min read

జగన్ పాలనలో తిరుమలలో మహాపాపాలు

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు, మహాపాపాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మంగళగిరిల

జగన్ పాలనలో తిరుమలలో మహాపాపాలు
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు, మహాపాపాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహారాలు జరిగాయని, అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని గుర్తుచేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు, హిందువులందరూ కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భక్తుల సౌకర్యాల విషయంలో గత ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. గతంలో తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అవగాహనకు వస్తున్నారని, అప్పట్లో టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వ్యవహరించిన భూమా కరుణాకర్ రెడ్డి పాత్రకు సంబంధించిన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.
Andhra Pradesh
Tirumala Tirupati Devasthanams
TTD Controversy
YSRCP Government
Jagan Mohan Reddy
BC Janardhan Reddy
టీడీపీ మీడియా సమావేశం
భక్తుల సౌకర్యాలు
ఆలయ పరిపాలన
Scroll for the next article