News11th Aug 04:40 PMSunil Byrisetty1 min read
సర్వర్ స్లోతో పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం
విజయవాడ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో పాస్‌పోర్ట్ కోసం వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదిగా
విజయవాడ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సర్వర్ స్లో కావడంతో పాస్‌పోర్ట్ కోసం వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఉదయం నుంచి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వద్ద అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. సర్వర్ సమస్య కారణంగా తమకు కేటాయించిన అపాయింట్‌మెంట్ స్లాట్‌లో కూడా లోపలికి అనుమతించకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా విజయవాడకు వచ్చిన అభ్యర్థులు సర్వర్ సమస్యతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒక స్లాట్‌కు మరో స్లాట్‌కు మధ్య అపాయింట్‌మెంట్ ఉన్న అభ్యర్థులు తమ సమయం దాటిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.సర్వర్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, అపాయింట్‌మెంట్ ఉన్న అభ్యర్థుల సేవలను పూర్తి చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.