Politics21st Sep 05:28 PMSunil Byrisetty1 min read

తూర్పులో వైసీపీకి ఎదురుదెబ్బ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ప

తూర్పులో వైసీపీకి ఎదురుదెబ్బ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ కాపు సామాజికవర్గ నేత. 2004లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొంది రెండుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ కూటమి ప్రభంజనంలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం వైఖరి, స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తన అనుచరులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించి వైసీపీకి గుడ్‌బై చెప్పే నిర్ణయం తీసుకున్నారు.
Scroll for the next article