Politics29th Aug 12:33 PMSunil Byrisetty1 min read
పిన్నెల్లి సోదరులకు షాకిచ్చిన హైకోర్టు!
మజ్జ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో వారికి ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖల
మజ్జ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో వారికి ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. బెయిల్ ఇవ్వకుండా కొట్టివేసింది. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి హైకోర్టు షాకిచ్చింది.