Politics17th Jul 01:36 PMSunil Byrisetty1 min read
వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి
అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍ను సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఈ పిటిషన్‍పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది.