News28th Sep 03:43 PMSunil Byrisetty1 min read
తిరుపతి నుంచి వారణాసికి ‘సేవా సంకల్ప్’ బైక్ యాత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నార
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ‘ఆశీర్వాద్ కా దియా’ పేరుతో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా రాష్ట్ర, దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించారు. దేశవ్యాప్తంగా డ్రాయింగ్, నాటక ప్రదర్శనలు సహా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ‘తిరుపతి–వారణాసి సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ చేపడుతోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు సాగే ఈ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై వారణాసిలో ముగియనుంది. సేవ, ప్రజా సంక్షేమం, సుపరిపాలన, ‘వికసిత్ భారత్ 2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రజా సంబంధిత అంశాలను వారణాసితో అనుసంధానించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.