News5th Oct 05:13 PMSunil Byrisetty1 min read

ఘనంగా సాగుతోన్న ‘సేవా సంకల్ప బైక్ యాత్ర’

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవా సంకల్ప బైక్ యాత్ర’ ఘనంగా సాగుతోంది. ఆంధ్రప్ర

ఘనంగా సాగుతోన్న ‘సేవా సంకల్ప బైక్ యాత్ర’
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవా సంకల్ప బైక్ యాత్ర’ ఘనంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం, మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాత్ర.. దేశవ్యాప్తంగా యువశక్తిని, ఆధ్యాత్మికతను, జాతీయ ప్రగతిని ఏకం చేస్తోంది. 5 రాష్ట్రాలు, 2,000 కిలోమీటర్ల మేర సాగే ఈ చారిత్రాత్మక యాత్రలో 25 మంది ప్రతిభావంతులైన యువ రైడర్లు పాల్గొంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఒక విశిష్ట ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణా నది, అలాగే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పుణ్యక్షేత్రం, గోదావరి నది నుంచి సేకరించిన పవిత్ర జలాలు, ప్రసాదాలతో కూడిన 'పవిత్ర జల కలశాన్ని' రైడర్లు భక్తిశ్రద్ధలతో కాశీ విశ్వనాథుని సన్నిధికి తీసుకువెళ్తున్నారు. తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర తెలంగాణలోని మంచిర్యాల మీదుగా సాగుతూ.. కూటమి నాయకుల ఘన స్వాగతం మధ్య ఐదో రోజు నాటికి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చేరుకుంది. నాగ్‌పూర్ వేదికగా వీఎంఆర్‌డిఎ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు నేతృత్వంలోని యాత్ర బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఫడణవీస్ కు తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని అందించి, యాత్ర విజయవంతం కావాలని వారి ఆశీస్సులు అందుకున్నారు.
Scroll for the next article