News2nd Oct 05:34 PMSunil Byrisetty1 min read
మంగళగిరిలో ‘సేవా సంకల్ప యాత్ర’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి నుంచి ప్రారంభమైన ‘సేవా సంకల్ప యాత్ర’ మంగళగిరి నియోజకవర్గానికి చేరుకుంది. మంగళగిరిలోని టీడీపీ జా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి నుంచి ప్రారంభమైన ‘సేవా సంకల్ప యాత్ర’ మంగళగిరి నియోజకవర్గానికి చేరుకుంది. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కేంద్ర కార్యాలయం వద్ద యాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి యాత్రను ముందుకు సాగించారు. మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలోని యువజన, విద్యార్థి విభాగాల నేతృత్వంలో తిరుపతి నుంచి వారణాసి వరకు ఈ బైక్ యాత్రను నిర్వహిస్తున్నారు. 25 మంది రైడర్లతో ప్రారంభమైన యాత్ర పలు రాష్ట్రాల మీదుగా సాగనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, తదితరులు పాల్గొని యాత్రకు స్వాగతం పలికారు. ప్రజల్లో సేవాభావాన్ని మరింత విస్తరించడంతో పాటు ప్రజాసేవకు సంబంధించిన సందేశాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో ‘సేవా సంకల్ప యాత్ర’ నిర్వహించడం అభినందనీయమన్నారు.