Health22nd Oct 05:17 PMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు
కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో అదనంగా 7 కొత్త డయాలసిన్ (రక్త శుద్ధి) కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వి
కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో అదనంగా 7 కొత్త డయాలసిన్ (రక్త శుద్ధి) కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విజయనగరం జిల్లా ఎస్.కోట, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, చిత్తూరు జిల్లా పీలేరు ఏరియా ఆసుపత్రుల్లో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, ఎస్పీఎస్ఆర్ జిల్లా వెంకటగిరి, బాపట్ల జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా సున్నిపెంట సీహెచ్‌సీ అనువత్రుల్లో ఈ డయాలసిస్ కేంద్రాలు కొత్తగా రానున్నాయని చెప్పారు. ప్రతి కేంద్రంలో ప్రతి రోజూ మూడు సెషన్ల ద్వారా 15 మందికి చొప్పున రక్త శుద్ది జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిన్ ప్రోగ్రాం (పిఎంఎన్డీపీ) కింద ఏర్పాటు కానున్న ఒక్కొక్క కేంద్రంలో సుమారు రూ.75 లక్షలు విలువచేసే 3 రక్త శుద్ధి యంత్రాలు/పరికరాలు సమకూరుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 232 కేంద్రాలు పనిచేస్తున్నాయి. రానున్న కొత్తవాటితో కలిపి వీటి సంఖ్య 239కు చేరుకుంటుంది.