News14th Sep 12:59 PMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఢిల్లీ పెద్దలు
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ల
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, అదనపు ఈవో కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్ర పటం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ ఎంపీ సుధా నారాయణమూర్తి పాల్గొన్నారు.