News25th Aug 04:32 PMSunil Byrisetty1 min read

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి:ఎస్ఎఫ్ఐ

విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్య

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి:ఎస్ఎఫ్ఐ
విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికై రాష్ట్రవ్యాప్తంగా ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వంటి తీరును ఎస్ఎఫ్ఐ ఖండిస్తుందన్నారు.
Andhra Pradesh
SFI
Education Minister
Student Protests
Kadapa
Chalo Collectorate
Student Agitation
విద్యాశాఖ మంత్రి
విద్యార్థి సమస్యలు
Scroll for the next article