News6th Sep 02:19 PMSunil Byrisetty1 min read
ఎస్ఎఫ్ఐ ఛలో విజయవాడ ఉద్రిక్తత
విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అజిత్‌సింగ్‌నగర్, సత
విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో కొన్ని మహిళా విద్యార్థినులు స్పృహ తప్పగా, వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, జీఓ 77 రద్దు, టీచర్ పోస్టుల భర్తీ, సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వందలాది విద్యార్థులు నిరసనకు హాజరయ్యారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి ర్యాలీకి వెళ్లే ప్రయత్నంలో ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన విద్యార్థులను, మహిళా కార్యకర్తలను ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు.