Spiritual28th Jul 10:12 AMSunil Byrisetty1 min read

విశిష్టంగా శాకంబరీ అమ్మవారి దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే వరంగల్ భద్రకాళీ దేవాలయంలో ఇక్కడ కూరగాయలు, పండ్లతో అమ్మవారిని

విశిష్టంగా శాకంబరీ అమ్మవారి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలాగే వరంగల్ భద్రకాళీ దేవాలయంలో ఇక్కడ కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయంలో కూడా శాకాంబరీ దేవిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. శాకాంబరీ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ఆకుకూరలు, కూరగాయలు వృథా చేయకుండా అన్నదానంలో భాగంగా వంటలలో ఉపయోగిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతో అద్భుతంగా అలంకరిస్తారు. ఈ అలంకరణ చూడటానికి చాలా మనోహరంగా ఉంటుంది.
Andhra Pradesh
Shakambari Devi
Shakambari Utsavam
Kanaka Durga Temple
Indrakeeladri
Bhadrakali Temple
అలంపూర్
కూరగాయల అలంకరణ
అన్నదానం
భక్తులు
ఆధ్యాత్మికం
ఆలయ ఉత్సవాలు
Scroll for the next article