Spiritual29th Jul 05:30 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా "శాకంబరీ ఉత్సవాలు" జరిగాయి. గురుపౌర్ణమి పర్వదినాన మహాపూర్ణాహుతితో ప్రశాంతంగా, ఘన

ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా "శాకంబరీ ఉత్సవాలు" జరిగాయి. గురుపౌర్ణమి పర్వదినాన మహాపూర్ణాహుతితో ప్రశాంతంగా, ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు రోజైన పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారు దివ్యమైన అలంకారంతో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు డ్రైఫ్రూట్స్‌తో కూడిన శాకంబరీ దేవి రూపంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. రైతులు, దాతలు ఉదారంగా అందించిన విరాళాలతో మొత్తం45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు డ్రైఫ్రూట్స్‌తో గర్భగుడి, ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణాన్ని మహోన్నతంగా అలంకరించారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలలో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.ఉత్సవాల సందర్భంగా వచ్చిన కూరగాయలతో తయారు చేసిన పవిత్ర 'కదంబం' ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు.
Andhra Pradesh
Kanaka Durga Temple
Indrakeeladri
Shakambari Utsavam
Shakambari Devi
Guru Purnima
Vijayawada
ఆలయ ఉత్సవాలు
కదంబం ప్రసాదం
పండ్లు
కూరగాయల అలంకారం
Scroll for the next article