News19th Mar 04:15 PMSunil Byrisetty1 min read
శక్తి యాప్ డౌన్‌లోడ్లు 1,49, 93,069
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 1,49, 93,069 మంది శక్తి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు యాప్‌ను ఆ
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పటి వరకు 1,49, 93,069 మంది శక్తి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
సీఎం చంద్రబాబు యాప్‌ను ఆవిష్కరించిన తర్వాత కేవలం 10 రోజుల్లోనే కోటిన్నర మంది శక్తి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
యాప్‌తోపాటు స్కూళ్లు, కాలేజీల వద్ద శక్తి టీంలను ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్ లేకుండా చర్యలు తీసుకుంటోంది.
మహిళల కోసం ప్రత్యేకంగా గ్రామీణస్థాయిలో కూడా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది.
యాప్ ఉపయోగించి నైట్ షెల్టర్ కోరితే పోలీసుల సంరక్షణలో ఆడబిడ్డలకు రాత్రి వేళల్లో రక్షణ కల్పిస్తామని చెబుతోంది.
26 జిల్లాలలో 26 నైట్ షెల్టర్లు ఉండగా, మరిన్ని పెంచేందుకు యోచిస్తోంది.
మరోవైపు క్రైం రేట్ తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వంలో దిశ యాప్‌ను తెచ్చిన విషయం తెలిసిందే.