News19th May 11:48 AMSunil Byrisetty1 min read
"శక్తి మొబైల్ యాప్" డౌన్ లోడ్లు 1,52,16,440!
మహిళలు, బాలికల భద్రతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన "శక్తి మొబైల్ యాప్" డౌన్ లోడ్లు. 1,52
మహిళలు, బాలికల భద్రతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన "శక్తి మొబైల్ యాప్" డౌన్ లోడ్లు. 1,52,16,440 దాటినట్లు వెల్లడించారు. ఇపుడు హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా "శక్తి యాప్"ను తీసుకొస్తున్నామన్నారు. మహిళల భద్రతకై రాష్ట్రవ్యాప్తంగా 164 శక్తి టీమ్స్ ఏర్పాటు చేయనున్నామన్నారు. శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతలపై 12,119 అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలపై తరచూ నేరాలు జరిగే 900 హాట్ స్పాట్స్ గుర్తించినట్లు తెలిపారు. హాట్ స్పాట్స్‌పై నిరంతర నిఘా పెట్టి, ఆధునిక సాంకేతికతతో మహిళలపై జరిగే నేరాలకు చెక్ పెడతామని పేర్కొన్నారు. మహిళాలపై హత్యాచారాలకు, హింసకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.