News16th Jul 03:51 PMSunil Byrisetty1 min read
చెప్పిన తేదీకే 'శంకర్ విలాస్ బ్రిడ్జ్' ప్రారంభం
గుంటూరులోని 'శంకర్ విలాస్ బ్రిడ్జ్' నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. చెప్పిన తేదీ ప్రకారమే 'శంకర్ విలాస్ బ్రిడ్జ్' ప్రారంభిస్తామని చెప్పారు. చిన
గుంటూరులోని 'శంకర్ విలాస్ బ్రిడ్జ్' నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. చెప్పిన తేదీ ప్రకారమే 'శంకర్ విలాస్ బ్రిడ్జ్' ప్రారంభిస్తామని చెప్పారు. చిన్నచిన్న సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరిస్తున్నామన్నారు. గుంటూరుకు అదృష్టం కొద్దీ ROBలు దక్కాయన్నారు. వాటి నిర్మాణానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. అందరి సహకారంతోనే ROBల నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జితో నగరంలోని కీలక ప్రాంతాల మధ్య ట్రాఫిక్ తగ్గుతుందని వివరించారు.