Spiritual30th Sep 11:16 AMSunil Byrisetty1 min read

చినకాకానిలో శరన్నవరాత్రి మహోత్సవాలు

చినకాకాని యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న రామాలయంలో 35వ దేవీ శరన్నవరాత్రులు దసరా మహోత్సవము పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి విగ్రహ వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనం

చినకాకానిలో శరన్నవరాత్రి మహోత్సవాలు
చినకాకాని యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న రామాలయంలో 35వ దేవీ శరన్నవరాత్రులు దసరా మహోత్సవము పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి విగ్రహ వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 8వరోజైన సోమవారం మూలా నక్షత్ర సందర్భంగా అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవిగా" భక్తులకు దర్శనం ఇచ్చారు. విద్యార్థులు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై చదువుల తల్లిని కరుణించమని వేడుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా "శ్రీటెక్ ఈదు ఓవర్సీస్" కన్సల్టెన్సీ ప్రతినిధులు లింగనేని సాయి చరణ్, లింగనేని పవన్ కళ్యాణ్, బొమ్మదేవర భూమిక వారి ఆధ్వర్యంలో భక్తులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మరోవైపు సాయంత్రం ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పాటు శ్రీకృష్ణదేవరాయ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Chinakakani
Sharannavaratri
Dasara Festival
Durga Devi Temple
Saraswati Devi Darshan
Students Worship
Book Distribution
Pen Distribution
ఉత్సవ కమిటీ
రామాలయం
కృష్ణదేవరాయ యువకులు
హిందూ పండుగలు
Scroll for the next article