Politics12th Dec 04:28 PMSunil Byrisetty1 min read

మోదీ, ఏపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు

ప్రధాని మోదీపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీలో కూటమి పాలన బాగుందని ప్రధాని చెప్పడం చూస్తుంటే, పచ్చకామెర్లు సోకిన వ్యక

మోదీ, ఏపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు
ప్రధాని మోదీపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీలో కూటమి పాలన బాగుందని ప్రధాని చెప్పడం చూస్తుంటే, పచ్చకామెర్లు సోకిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, రోగులు పడుతున్న కష్టాలు ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. "గిట్టుబాటు ధర లేక రైతులు పంటలను తగలబెడుతున్నా, తుపానులతో సర్వం కోల్పోయినా ప్రభుత్వం ఆదుకోలేని నిర్లక్ష్యం ప్రధానికి కనిపించదు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక వారి కష్టాలు, ఆరోగ్యశ్రీ నిలిచిపోవడంతో రోగుల వేదన ఆయన దృష్టికి రావడం లేదు" అని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, హామీల అమలులో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, విభజన హామీలను కూటమి పార్టీలు ప్రధాని కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాయని షర్మిల దుయ్యబట్టారు.
Andhra Pradesh Government
YS Sharmila
Congress AP
PM Modi
Political Criticism
Farmers Issues
Students Problems
Health Scheme
Super Six Promises
సూపర్ సిక్స్ హామీలు
రాజకీయ విమర్శలు
రాజకీయాలు
విభజన హామీలు
Scroll for the next article