Politics24th Mar 01:06 PMSunil Byrisetty1 min read

జగన్‌పై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, సొంత సోదరుడు వైయస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. పార్లమెంట్ స్థానాల పునర్విభజనపై జగన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఆయన మౌనానిక

జగన్‌పై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, సొంత సోదరుడు వైయస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. పార్లమెంట్ స్థానాల పునర్విభజనపై జగన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ప్రశ్నించారు. జగన్ మౌనం చూస్తుంటే.. పరోక్షంగా డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. డీలిమిటేషన్‌పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు, పవన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు.
Andhra Pradesh
YS Jagan
Sharmila
డీలిమిటేషన్‌
Scroll for the next article