Astrology29th Mar 03:02 PMSunil Byrisetty1 min read
ఏర్పడనున్న షష్ఠ గ్రహ కూటమి.. పరిహారాలు?
మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఆరు గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై మే 31వ తేదీ వరకు
మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఆరు గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది.
ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై మే 31వ తేదీ వరకు కచ్చితంగా ఉంటుంది.
మార్చి 29వ తేదీన ఏర్పడే షష్ఠగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్ఠగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకునే అంశం.
మార్చి 28వ తేదీన చంద్రుడు మీన రాశిలోకి వచ్చాడు. మార్చి 29వ తేదీన శని దేవుడు మీన రాశిలోకి సంచరించనున్నాడు.
గతంలో 2019 డిసెంబర్ 25వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది.
ఆ తరువాత కరోనా మహమ్మారి విజృంభించి విలయ తాండవం చేసింది.
ఇక ఇప్పుడు మళ్లీ 2025 మార్చి 29వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది.
ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
షష్ఠగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలోని గ్రహాల స్థానాలను బట్టి ఇతర రాశులలో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుని దానినిబట్టి నెగిటివ్ ప్రభావాలు వచ్చేవారు జాగ్రత్తగా పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.