News9th May 12:56 PMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మ దేవస్థానం ఈవోగా శీనా నాయక్!
విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా వి. కె. శీనానాయక్ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చే
విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా వి. కె. శీనానాయక్ ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
తొలుత ఆయన కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
అనివేటి మండపంలో వేద పండిత ఆశీర్వచనం స్వీకరించారు.
అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
తదుపరి దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది, ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశమై భక్తులకు కల్పించవలసిన సౌకర్యాలు గురించి వివరాలు తెలుసుకున్నారు.
శ్రీ అమ్మవారి దర్శనాన్ని సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.