Education18th Jul 03:27 PMSunil Byrisetty1 min read
20న ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026’
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు 2026 మార్చిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచ
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు 2026 మార్చిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించేందుకు ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జూలై 20 మధ్యాహ్నం 2 గంటల నుంచి చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయని, అవార్డు గ్రహీత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు.