Education6th Jun 03:57 PMSunil Byrisetty1 min read

మే 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ

10th, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. 'షైనింగ్ స్టార్స్' పేరుతో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి అవార్డులకు ఎ

మే 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ
10th, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. 'షైనింగ్ స్టార్స్' పేరుతో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి అవార్డులకు ఎంపిక చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9న జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అవార్డులు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేస్తుంది. అవార్డులో 20,000 నగదు బహుమతి, మెడల్, అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. పదవ తరగతిలో 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులను.. ప్రతి మండలానికి 6 గురు (Oc -2, Bc-2, Sc-1, St-1 Boy or Girl) విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్లో 830 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులు..ప్రతి జిల్లా నుంచి 36 మందిని ఎంపిక చేస్తారు.
Andhra Pradesh news
10th class
inter education department
shining star awards
2024-25 ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు
Scroll for the next article