News13th May 10:59 AMSunil Byrisetty1 min read

ఆంధ్రప్రదేశ్‍కు మరో కీలక బాహుబలి ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‍కు మరో కీలక బాహుబలి ప్రాజెక్టు రాబోతోంది. దుగరాజపట్నంలో భారీ నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రాజెక్టుకు సుమారు రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనాలు వేయగ

ఆంధ్రప్రదేశ్‍కు మరో కీలక బాహుబలి ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్‍కు మరో కీలక బాహుబలి ప్రాజెక్టు రాబోతోంది. దుగరాజపట్నంలో భారీ నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రాజెక్టుకు సుమారు రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనాలు వేయగా.. కేంద్ర నౌకాయాన, జల రవాణా శాఖ మంత్రి బృందం ఏపీకి వచ్చి పరిశీలన చేయనుంది. సీఎం చంద్రబాబుతో భారీ నౌకా నిర్మాణ కేంద్రంపై చర్చించనుంది.. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో ఓడల తయారీ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విదేశీ సంస్థలతో కలిసి షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ల కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర విదేశీ సంస్థల మధ్య చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
Andhra Pradesh
Tirupati
Dugarajapatnam
దుగరాజపట్నంలో భారీ నౌకా నిర్మాణం
కేంద్ర నౌకాయాన
జల రవాణా శాఖ మంత్రి బృందం ఏపీకి వచ్చి పరిశీలన
Scroll for the next article