Entertainment21st Nov 12:51 PMSunil Byrisetty1 min read

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లకు బల్దియా షాకిచ్చింది. ట్రేడ్ లైసెన్స్ స్టూడియోలు ఫీజు తక్కువ చెల్లిస్తున్నాయి. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లకు బల్దియా షాకిచ్చింది. ట్రేడ్ లైసెన్స్ స్టూడియోలు ఫీజు తక్కువ చెల్లిస్తున్నాయి. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేత చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు లెక్క తేల్చింది. అలాగే రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించింది. షూటింగుల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న స్టూడియోలు పన్ను విషయంలో మాత్రం ఎగవేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ నోటీసులు జారీ అయ్యాయి.
Hyderabad
GHMC
Annapurna Studios
Ramanaidu Studios
Tax Evasion
Trade License Fee
Hyderabad
Film Studios
GHMC Notices
స్టూడియోస్
జీహెచ్ఎంసీ
పన్ను ఎగవేత
ట్రేడ్ లైసెన్స్
Scroll for the next article