National11th Nov 10:16 AMSunil Byrisetty1 min read
ఎర్రకోట పేలుడు.. సూత్రధారి ఉమర్ వీడే..
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోల
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు బయటపెట్టారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కారు ముక్కలైంది. ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. "గాయపడిన వారి శరీరాలపై పేలుళ్లలో సాధారణంగా కనిపించే పదునైన వస్తువులు లేదా గాట్లు ఏవీ లేవు. ఇది కాస్త అసాధారణంగా ఉంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశాం" అని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ వంటి శక్తిమంతమైన పేలుడు పదార్థాల మిశ్రమాన్ని వాడినట్లు అధికారులు భావిస్తున్నారు.